logo

ఒగ్గు పూజారులు పరస్పర రాళ్లు, కర్రలతో దాడి.


సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయం చెంత ఇరు వర్గాలకు చెందిన ఒగ్గు పూజారులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఘటనలో 15 మంది గాయపడ్డారు. కొన్నేళ్లుగా ఆలయంలో పట్నాలు, ఇతర పూజలను చెరుకూరి వర్గంలోని 26 మంది, కోటి వర్గంలో 22 మంది, పయ్యావుల వర్గంలో 10 మంది నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ సూచనతో మరో 10 మందిని పయ్యావుల వర్గంలో ఒగ్గు పూజారులుగా ఈనెల 9న ఆలయ ఈవో నియమించారు. దీనిపై చెరుకూరి, కోటి వర్గాలు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చాయి. వారం రోజులుగా దీనిపై వాగ్వాదం జరుగుతోంది. పూజలు నిర్వహిస్తున్న పయ్యావుల వర్గంపై మిగిలిన రెండు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేయగా వారు ప్రతిదాడికి దిగారు. భయభ్రాంతులకు గురైన భక్తులు, అధికారులు దాక్కున్నారు. రెండు వర్గాలకు చెందిన 15 మంది ఒగ్గు పూజారులు, ఇతరులు గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. అయిదుగురిని దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

0
0 views